News November 10, 2025
మంచిర్యాల: రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

2026-26 సం.నికి ధాన్యం కొనుగోలు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ నం.6303928682 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో 1967, 180042500333 నంబర్లకు సంప్రదించాలన్నారు.
Similar News
News November 11, 2025
నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం
News November 11, 2025
VER అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: చంద్రబాబు

AP: శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ ఎకానమిక్ రీజియన్(VER) అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సీఎం తెలిపారు.
News November 11, 2025
గోదావరిఖనిలో బయటపడ్డ అష్టభుజాల సింహవాహిని

రామగుండం ఎన్టీపీసీ ఏరియా సోలార్ ప్లాంట్ పక్కనే ఉన్న ఏరియాలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది. విగ్రహం గుర్తించిన స్థానికులు విషయాన్ని హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో వారు అర్చకులు సతీష్ శాస్త్రితో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి, పసుపుకుంకుమలను సమర్పించి ప్రత్యేక హారతులు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.


