News November 10, 2025

నిర్మల్: రక్షణ కిట్లను అందజేసిన కలెక్టర్

image

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణీ, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

ఈసారి జూబ్లీహిల్స్‌ ఆదర్శం కావాలి.. ఓటెత్తి తీరాలి..!

image

2009లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది ఓటేసింది ఎప్పుడంటే 2009లోనే.. అప్పుడు 52 శాతం మంది ఓటు వేశారు. ఆ తరువాత ఈ ఓటింగ్‌ శాతం తగ్గుతూ వస్తోంది. ఈ ఉపఎన్నికలో ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందూ ఇలానే అనుకుంటారు. కానీ అలా జరగడం లేదు. మరి నేడైనా అందరూ పోలింగ్‌ కేంద్రాలకు కదలి ఓటెత్తి ఆదర్శంగా నిలవాలి.

జిల్లాలో 58,451 MTల ధాన్యం సేకరణ పూర్తి

image

సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 58,451 MTల ధాన్యాన్ని సేకరించారు. IKP, PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 225 కొనుగోలు కేంద్రాల్లో 9,155 మంది రైతుల నుంచి రూ.139.64 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రులతో నిన్న జరిగిన వీసీలో జిల్లాధికారులు వెల్లడించారు. 2,362 మంది రైతులకు రూ.37.01 కోట్లు చెల్లించామన్నారు. జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 2.70 లక్షల MTల ధాన్యం సేకరించనున్నామన్నారు.