News April 11, 2024

ప్రకాశం: ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలి

image

ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్‌కు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నోడల్ అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని, ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టాలన్నారు.

Similar News

News March 24, 2026

దోర్నాల: సూసైడ్‌కు యత్నించిన యువకుడు.. చివరికి

image

యర్రగొండపాలెంకి చెందిన ఓ యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి దోర్నాల వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. SI తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ యువకుడిని గుర్తించారు. కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.

News March 24, 2026

Y.పాలెం: పులివెందుల 2వ పులి అంటూ ఫ్లెక్సీలు

image

పుల్లలచెరువు మండలం మల్లెపాలెం సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్లలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. వై.పాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ పులివెందుల రెండో పులి అంటూ అభిమానులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.

News March 24, 2026

కొత్తగా మార్కాపురం MP సీట్..?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో MLA, MP సీట్లు పెరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒంగోలు, బాపట్ల MP స్థానాలు ఉన్నాయి. కొత్తగా మార్కాపురం పార్లమెంట్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 12MLA సీట్లు ఉండగా ఆ సంఖ్య 18కి చేరే అవకాశం ఉంది. గతంలో మార్టూరు నియోజకవర్గంగా ఉండగా దాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. కొత్తగా పొదిలి, పామూరు, కంభం, చీమకుర్తితో పాటు ఒంగోలులో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది.