News April 11, 2024
ఏలూరు: ఉదయం YSRCP.. సాయంత్రం TDP

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉదయం వైసీపీలో చేరిన ఎమ్మార్సీ కాలనీకి చెందిన వార్డు మెంబర్ బాలిన శివ గంటల వ్యవధిలోనే తిరిగి టీడీపీలో చేరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ.. స్వార్థపరులే పార్టీని వీడి పోయారని, అలాంటి వాళ్ల వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు.
Similar News
News July 10, 2025
భీమవరంల: రాష్ట్ర స్థాయి సెస్ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ

విద్యార్థులకు మేధాశక్తిని పెంపొందించే క్రీడ చెస్ అని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. గురువారం భీమవరంలో ఈ పోటీల బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహకులు మాదాసు కిషోర్ మాట్లాడారు. అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏ.పీ. స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను జరుపుతున్నామన్నారు.
News July 10, 2025
641.544 కిలోల గంజాయి ధ్వంసం చేసిన: ఎస్పీ

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్‌లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్‌లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News July 10, 2025
అవార్డులు అందుకున్న ముగ్గురు జిల్లా అధికారులు

విజయవాడలో బుధవారం జరిగిన సభలో రెడ్‌క్రాస్ నిధుల సేకరణలో విశేష కృషి చేసిన ముగ్గురు జిల్లా అధికారులకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మెడల్స్ అందించి, సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జె.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వేణుగోపాల్, రిటైర్డ్ డీఈఓ వెంకటరమణలు ఈ మెడల్స్‌ను అందుకున్నారు. వీరు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రెడ్‌క్రాస్ సేవల కోసం రూ.5 లక్షలకు పైగా నిధులు సమకూర్చారు.