News November 11, 2025
భద్రకాళి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామివారికి అసంఖ్యాక రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.
Similar News
News November 11, 2025
ములుగు: పథకం ప్రకారమే లొంగిపోయారు: ‘మావో’ లేఖ

ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు సోను, సతీశ్‌లకు మావోయిస్టు పార్టీ పంథాను తప్పుపట్టే హక్కు లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సోను, సతీశ్‌లు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని పథకం ప్రకారం లొంగిపోయారన్నారు. అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అడవుల్లో మోహరించాయన్నారు.
News November 11, 2025
బాలికల గురుకుల పాఠశాల ఘటనలో నిందితుడు అరెస్ట్

కదిరిలో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమంగా ప్రవేశించి బాలికలను భయాందోళనకు గురి చేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈనెల 4న రాత్రి సమయంలో కుమ్మరోళ్లపల్లి గ్రామానికి చెందిన మహేష్(20) హాస్టల్ గోడదూకి
గురుకులంలోకి ప్రవేశించాడు. అడ్డుకునేందుకు యత్నించిన సెక్యూరిటీ గార్డు ఉమాదేవి, బాలికలను కర్రతో బెదిరించి పారిపోయాడు. ఈ ఘటనపై కదిరి టౌన్ PSలో కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.
News November 11, 2025
కామారెడ్డి: ఆరుగురికి జైలు.. 50 మందికి జరిమానా

మద్యం తాగి వాహనం నడిపితే, శిక్ష తప్పదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. కామారెడ్డి, దేవునిపల్లి, తాడ్వాయి PS పరిధిలోని ఆరుగురు (ప్రతి స్టేషన్‌కు ఇద్దరు) నిందితులకు కోర్టు ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. అదేవిధంగా మాచారెడ్డి, సదాశివనగర్, బిక్కనూర్ PS పరిధిలోని కేసులతో కలిపి మొత్తం 50 మంది డ్రైవర్లకు న్యాయస్థానం రూ.50 వేల జరిమానా విధించినట్లు SP వివరించారు.


