News April 11, 2024
యాడికి: విషపురుగు కుట్టి వృద్ధురాలు మృతి

యాడికి మండలం గుడిపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు విషపురుగు కుట్టడంతో మృత్యువాత పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మమ్మ ఇంటి వద్ద అరుగుపై కూర్చొని ఉన్న సమయంలో విషపురుగు కుట్టింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 8, 2026
ఐటీ రంగంలో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వండి: ఎంపీ

ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ రంగంలో రాణించేందుకు అవసరమైన శిక్షణ అందించాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం జేఎన్‌టీయూ వీసీ సుదర్శన్ రావును కలిసి బెంగళూరు ఐటీ నిపుణుల బృందాన్ని పరిచయం చేశారు. చివరి ఏడాది విద్యార్థులకు ఏఐ వంటి ఆధునిక అంశాలపై శిక్షణ ఇస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విసి, త్వరలోనే కమిటీ వేసి శిక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని విజయాలను సాధిద్దాం: వీసీ

అనంతపురం జేఎన్టీయూలోని పరిపాలన భవనంలో మంగళవారం వీసీ హంచాటే సుదర్శన రావు, యూనివర్సిటీ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ.. 15వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో యూనివర్సిటీకి మరిన్ని విజయాలను సాధించేందుకు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.