News November 11, 2025
సిద్దిపేట: ‘అందెశ్రీ’ అసలు పేరు వెనుక ఉన్న రహస్యం..!

సహజ కవి అందెశ్రీకి చదువుకునే అవకాశం రాలేదు. ప్రకృతి ఒడిలోనే పైరగాలిలో, మట్టివాసనల్లో ఆయన మనసు కవిత్వం అల్లింది. అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. తాపీ పని నేర్చుకోవడానికి నిజామాబాద్ వెళ్లినప్పుడు శృంగేరి మఠానికి చెందిన స్వామీ శంకర్ మహారాజ్ ఆయన పాటలు విన్నారు. ఆశువుగా అద్భుతమైన కవిత్వం చెప్పే ఆయన ప్రతిభను గుర్తించి, చేరదీసి ఆయన పేరును అందెశ్రీగా మార్చారు. అప్పటి నుంచే ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది.
Similar News
News November 11, 2025
ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

వానాకాలం-2025 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.
News November 11, 2025
బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.
News November 11, 2025
KMR: ఈ నెల 17న ‘ఆస్మిత’ అథ్లెటిక్స్ పోటీలు

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన ‘ఆస్మిత’ ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్స్ ఈ నెల 17న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ లీగ్స్ కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో 8 గంటలకు ప్రారంభం అవుతాయి. క్రీడాకారులు తప్పనిసరిగా తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ డ్రెస్ కోడ్‌తో హాజరు కావాలని పేర్కొన్నారు.


