News November 11, 2025
నేడు మూడు చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన

అనకాపల్లి జిల్లాలో గల మూడు నియోజకవర్గాల్లో మంగళవారం ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎస్.నరసింహారావు తెలిపారు. సోమవారం మాకవరపాలెం మండలంలోని ఎరకన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సీపట్నం నియోజకవర్గంలో గల ఎరకన్నపాలెం, నక్కపల్లి, పరవాడలో ఎంఎస్‌ఎంఈ పార్కులకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News November 11, 2025
ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

వానాకాలం-2025 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.
News November 11, 2025
బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.
News November 11, 2025
KMR: ఈ నెల 17న ‘ఆస్మిత’ అథ్లెటిక్స్ పోటీలు

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన ‘ఆస్మిత’ ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్స్ ఈ నెల 17న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ లీగ్స్ కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో 8 గంటలకు ప్రారంభం అవుతాయి. క్రీడాకారులు తప్పనిసరిగా తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ డ్రెస్ కోడ్‌తో హాజరు కావాలని పేర్కొన్నారు.


