News November 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 11, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News February 25, 2026

HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

image

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదేళ్ల వయసు నాటి నుంచి 45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది. 9 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.

News February 25, 2026

కీరదోసలో బూజు తెగులు – నివారణ

image

కీరదోసలో ఈ తెగులు ఆశిస్తే ఆకు అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడుతుంది. తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఆకు అడుగున ఊదారంగు మచ్చలు, పైభాగాన పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు త్వరగా ఎండిపోయి రాలిపోతాయి. అధిక తేమ, పొగ మంచు ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్‌ 64% WP 3 గ్రాములను కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

News February 25, 2026

గర్భాశయ క్యాన్సర్‌కు ముందు కనిపించే లక్షణాలివే..

image

గర్భాశయ క్యాన్సర్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఏటా 3లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం HPV. దీనివల్ల గర్భాశయకణాల్లో మార్పు వచ్చి క్యాన్సర్‌గా మారుతుంది. దుర్వాసనతో డిశ్చార్జ్, సెక్స్ సమయంలో నొప్పి, బరువు తగ్గడం, కాళ్లలో నొప్పి, వాపు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలుంటే గర్భాశయ క్యాన్సర్‌గా అనుమానించాలి. HPV‌వ్యాక్సిన్‌ తీసుకోవడంతో పాటు తరచూ పాప్ స్మియర్ టెస్ట్ చేయంచుకోవడం మంచిది.