News November 11, 2025
9 మంది యువకులపై బైండోవర్ కేసులు

కదిరిలో గంజాయి తాగుతున్న యువకులపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం వీరిపై బైండ్ ఓవర్ కేసులు నమోదుచేసి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. మంగళవారం తహశీల్దార్ ముందు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఫైన్ విధించి, బైండ్ ఓవర్ చేయనున్నట్లు వివరించారు. గంజాయిని వాడే 17 ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్‌కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.
News November 11, 2025
సంగారెడ్డి: నేటి నుంచి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులందరూ జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
News November 11, 2025
NLG: ధాన్యం సేకరణ నిబంధనల ఉల్లంఘన: ఇద్దరు అధికారులు సస్పెండ్!

ధాన్యం సేకరణ నియమాలను ఉల్లంఘించినందుకుగాను నల్గొండ జిల్లా, మిర్యాలగూడ, ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి కుమారి అఫీసర్‌ను, అలాగే అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి కె.సైదులును విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు.


