News November 11, 2025
ములుగు: పథకం ప్రకారమే లొంగిపోయారు: ‘మావో’ లేఖ

ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు సోను, సతీశ్‌లకు మావోయిస్టు పార్టీ పంథాను తప్పుపట్టే హక్కు లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సోను, సతీశ్‌లు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని పథకం ప్రకారం లొంగిపోయారన్నారు. అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అడవుల్లో మోహరించాయన్నారు.
Similar News
News November 11, 2025
ఏపీ టుడే

* జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం.. విజయవాడలో రాష్ట్ర స్థాయి వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
* ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 50 MSME పార్కులు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* ఇవాళ బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. మొంథా తుఫానుతో పంట నష్టం పరిశీలన
* శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’.. ఈ నెల 20 వరకు నిర్వహణ
News November 11, 2025
మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్‌లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.


