News November 11, 2025

JGTL: నిరుద్యోగ మహిళలకు NOV 14న జాబ్ మేళా

image

JGTL జిల్లాలోని నిరుద్యోగ మహిళల జాబ్ మేళాను 14వ తేదీ ఉదయం 10గంటల నుంచి పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ కంపెనీలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు సర్టిఫికెట్ల జిరాక్స్, 2 ఫొటోలు తీసుకునివెళ్లాలి. భోజన వసతి ఉంటుంది. ఈ జాబ్ మేళా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో టి.సదాశివ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. SHARE IT.

Similar News

News November 11, 2025

షమీ అన్ని ఫార్మాట్లలో ఆడాలి: గంగూలీ

image

దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న భారత బౌలర్ షమీకి దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు. రంజీల్లో ప్రదర్శన చూస్తే ఆయన ఫిట్‌గా ఉన్నాడనే విషయం అర్థమవుతుందన్నారు. షమీ టీమ్‌ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడాలని దాదా ఆకాంక్షించారు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ జట్టుకు ఎందుకు సెలక్ట్ అవట్లేదో అర్థం కావట్లేదన్నారు. ఈ సీజన్‌లో వెస్ట్ బెంగాల్ తరఫున 2 రంజీ మ్యాచుల్లో షమీ 15 వికెట్లు తీశారు.

News November 11, 2025

హనుమాన్ చాలీసా భావం – 6

image

శంకర సువన కేసరీనందన|
తేజ ప్రతాప మహా జగవందన||
హనుమంతుడు సాక్షాత్తూ శివుని అంశ నుంచి జన్మించాడు. అలాగే కేసరి నందనుడు. ఆయన తేజస్సు, ప్రతాపం అపారం. అందుకే సమస్త జగత్తు ఆయనకు నమస్కరిస్తుంది. ఆయన దర్శనం, స్మరణ మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతాయి. ప్రతికూల పరిస్థితులలో భయం వీడేలా ఆయన తేజస్సు మనకు శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 11, 2025

KMR: వీధి కుక్కల బెడదకు చెక్ పడుతుందా?

image

వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన రద్దీ ఉండే ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లాలో కూడా వీధి కుక్కల దాడికి గురై అనేక మంది గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.