News November 11, 2025
సంగారెడ్డి: నేటి నుంచి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులందరూ జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
Similar News
News November 11, 2025
తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది: సోమిరెడ్డి

తిరుమల లడ్డూ కల్తీ కుట్రదారుల పాపం పండుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ హయాంలో లీటర్‌కు రూ.20 కమీషన్ తీసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవీ సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు.
News November 11, 2025
రాజమౌళి సర్‌ప్రైజ్‌లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ

మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను రాజమౌళి వరుస సర్‌ప్రైజ్‌లతో ముంచెత్తుతున్నారు. ఈ నెలలో SSMB29 నుంచి కేవలం టైటిల్ గ్లింప్స్, లుక్ రిలీజ్ చేస్తారని భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా పృథ్వీరాజ్ లుక్, ఓ <<18251735>>సాంగ్<<>>ను రిలీజ్ చేశారు. త్వరలో ప్రియాంక లుక్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. అటు ఈ నెల 15న టైటిల్‌తో పాటు 3 నిమిషాల గ్లింప్స్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అప్డేట్లతో మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News November 11, 2025
ఖమ్మం: సదరం స్కామ్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో గత రెండేళ్లలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా సదరం విభాగానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. స్కామ్‌లో పాలుపంచుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలగించి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


