News November 11, 2025
మణుగూరులో 4,000 ఉద్యోగాలకు జాబ్ మేళా

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న మణుగూరులో జరగనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. భద్రాద్రి స్టేడియంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాకు 100కు పైగా కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఈ మేళా ద్వారా 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
SRD: ఆఫ్ సెంచరీ తర్వాత.. ఆప్తుల చెంతకు!

15 ఏళ్ల వయస్సులో సొంతూరు, సొంతవాళ్లను వదిలి వెళ్లిన వ్యక్తి 50 ఏండ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. వివరాలిలా.. ఝరాసంగం మండలం బొప్పనపల్లి చెందిన కమ్మరి నాగప్ప, మోహనమ్మ దంపతుల చిన్న కుమారుడు సంగన్న తన 15వ ఏటా గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు వెళ్లి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. హఠాత్తుగా తన సొంతూరికి రాగా గ్రామస్థులు సన్మానించారు.
News November 11, 2025
ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.
News November 11, 2025
నేడు బాపట్లలో పర్యటించనున్న కేంద్ర బృందం: కలెక్టర్

బాపట్ల జిల్లాలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలన చేయనుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ తయారు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


