News November 11, 2025
వనపర్తి నుంచి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

వనపర్తి డిపో నుంచి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ కోసం ఈనెల 15న రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ యాత్రలో కాణిపాకం, వేలూరులోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఈనెల 18న బస్సు తిరిగి వనపర్తికి చేరుకుంటుంది. వివరాలకు 7382829379 నంబరులో సంప్రదించవచ్చు.
Similar News
News November 11, 2025
పాలమూరు: నేడు యోగా,ఖో-ఖో ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 విభాగాల్లో యోగా, అండర్-17 విభాగంలో ఖో-ఖో ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపికలు ఉంటాయని, క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, టెన్త్ మెమో (U-19), ఆధార్ కార్డులతో ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
News November 11, 2025
కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్‌డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
News November 11, 2025
జడ్చర్ల: 305 గ్రాముల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారు ఆర్.బి.ఆర్ కంపెనీలో వంట మాస్టర్‌గా పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ రవిదాస్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ విప్లవ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై కార్తీక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ సిద్ధార్థ పాల్గొన్నారు.


