News November 11, 2025

డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

image

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.

Similar News

News February 21, 2026

YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారు: యూత్ కాంగ్రెస్

image

ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ తీరు దేశాన్ని కించపరిచేలా ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాజకీయాల కంటే దేశ ప్రతిష్ఠ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీనిపై యూత్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. YSR వారసత్వాన్ని జగన్ దిగజారుస్తున్నారని, CID/ED కేసుల భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదిలేశారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

News February 21, 2026

AUSWపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

image

అడిలైడ్ వేదికగా జరిగిన <<19201544>>మూడో టీ20లో<<>> ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 17 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌ను 159/9 స్కోరుకే పరిమితం చేసింది. ఆష్లీ గార్డనర్ 57, లిచ్‌ఫీల్డ్ 26 మినహా అందరూ విఫలమయ్యారు. శ్రీచరణి, శ్రేయాంక చెరో 3, అరుంధతి 2, రేణుక ఒక వికెట్ తీశారు.

News February 21, 2026

ట్రంప్‌కు బొమ్మ చూపించాడు!

image

విదేశాలపై టారిఫ్స్ వేసే అధికారం USA అధ్యక్షుడికి లేదని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పడం తెలిసిందేగా. USAలోని చిన్న బొమ్మల కంపెనీ ఓనర్ రిక్ ఈ తీర్పు కోసం పోరాడారు. తన లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ చైనా నుంచి టాయ్స్ కొని USAలో వ్యాపారం చేస్తుంది. ట్రంప్ టారిఫ్స్‌తో నష్టపోయిన రిక్, తనలాంటి వ్యాపారులతో కలిసి కోర్టుకెళ్లి కేసు గెలిచారు. తమ నుంచి వసూలు చేసిన అదనపు సుంకం ఇవ్వాలనేది రిక్ తాజా డిమాండ్.