News November 11, 2025

VKB: లగచర్ల ఘటనకు నేటికి ఏడాది

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన జరిగి నేటికి ఏడాది అవుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌కు దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. హాజరైన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన సంగతి విదితమే. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు గ్రామస్థులు అరెస్టు కావడంతో ఉద్రిక్తత కొనసాగింది.

Similar News

News November 11, 2025

కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

image

కరోనా లాక్‌డౌన్‌ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

News November 11, 2025

పూతలపట్టు: అదుపుతప్పి ఐచర్ వాహనం బోల్తా

image

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గల జాతీయ రహదారిపై ఐచర్ వాహనం బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం అతివేగంగా వెళ్లి బోల్తా పడింది. ఇందులో ఉన్న దానిమ్మ కాయలు కోసం ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.

News November 11, 2025

అల్లూరి జిల్లాలో CIల బదిలీ

image

అల్లూరి జిల్లాలో సీఐలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. NDPS టాస్క్ఫోర్స్ CIగా పనిచేస్తున్న సువారి రాముని విశాఖ రేంజ్‌కి బదిలీ చేశారు. విశాఖ రేంజ్‌లో ఉన్న AS లక్ష్మణరావుని ఆ స్థానంలో నియమించారు. విజయనగరం DCRBలో పనిచేస్తున్న సుధాకర్‌ను జిల్లాలోని GK విధి CIగా బదిలీ చేస్తూ DIG ఆదేశాలు జారీ చేశారు.