News November 11, 2025
విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏసీపీ తనిఖీలు

విజయవాడ బెంజ్ సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి సర్వీస్ రోడ్డు వద్ద రాత్రిపూట వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న మీడియా కథనాలపై పోలీసులు స్పందించారు. సోమవారం రాత్రి ఏసీపీ దామోదర్ ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఇక్కడ వ్యభిచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీఐ పవన్ కిషోర్‌కు సూచించారు. రాత్రి వేళల్లో బీట్ ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.
Similar News
News November 11, 2025
శ్రీసిటీలో రూ.1629 కోట్ల పెట్టుబడి.. 2,630 మందికి జాబ్స్

రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నిన్న మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీసిటీలో SCIC వెంచర్స్ LLP రూ.550 కోట్ల పెట్టుబడితో ACల్లో వినియోగించే PCBA, BLDC మోటార్ల తయారీ యూనిట్‌ను స్థాపించనుంది. క్రయో నెక్స్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,079 కోట్ల పెట్టుబడితో IT ఎన్‌క్లోజర్లు, PCB బేర్ బోర్డుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.
News November 11, 2025
సూర్యాపేట జిల్లాలో మంచిర్యాల వాసి మృతి

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఈటే శ్రీకాంత్ అనే యువకుడు సూర్యాపేట జిల్లాలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ పనిచేస్తున్న శ్రీకాంత్ ఇటీవల చెన్నై వెళ్లి లారీ లోడ్‌తో తిరిగి వస్తున్న క్రమంలో ఈనెల 9న గరిడేపల్లి మండలం మర్రికుంట సమీపంలో సాగర్ ఎడమ కాలువ వద్ద ఆగారు. సరదాగా ఈత కొట్టేందుకు కాలువలోకి దూకిన శ్రీకాంత్ గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టగా సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది.
News November 11, 2025
మెదక్: చేగుంటలో చిరుత పులి మృతి

చేగుంట మండలం గొల్లపల్లి తండా, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన <<18254855>>చిరుత పులి <<>> మంగళవారం ఉదయం మృతి చెందింది. నిన్న సాయంత్రం చెట్ల పొదల్లో కదలలేని స్థితిలో కనిపించిన చిరుతను గ్రామస్థులు గుర్తించారు. మంగళవారం ఉదయానికి మృతి చెందిన చిరుతపులిని గొడుగుపల్లి శివారులో గుర్తించారు. అటవీ అధికారులు విచారణ చేస్తున్నారు.


