News April 11, 2024
రంజాన్ మాసంలో బిర్యానీదే అగ్రస్థానం

రంజాన్ మాసంలో బిర్యానీ ఆర్డర్లు భారీగా పెరిగినట్లు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. గత నెల 12 నుంచి ఈ నెల 8వరకు స్విగ్గీ ఆర్డర్ల జాబితాను సంస్థ విడుదల చేసింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. వాటిలో 10 లక్షలు హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం. ఇక హలీమ్ ఆర్డర్లు 1454శాతం, ఫిర్ని 80.97శాతం, మాల్పువా 79.09శాతం పెరిగినట్లు స్విగ్గీ తెలిపింది.
Similar News
News March 18, 2026
BREAKING: స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,57,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,44,600గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,75,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 18, 2026
గ్యాస్ కొరత: ఇన్‌స్టంట్ ఫుడ్ సేల్స్‌లో 20% జంప్

వంట గ్యాస్ కొరత తీవ్రం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. సిలిండర్ బుక్ చేసినా డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ఇన్‌స్టంట్ నూడుల్స్, ఉప్మా మిక్స్, రెడీమేడ్ పులిహోర వంటి వాటిపై ఆధారపడుతున్నారు. దీంతో రెడీ-టు-ఈట్ ఫుడ్స్, ఫ్రోజెన్ స్నాక్స్ సేల్స్ 20% పెరిగాయి. సూపర్ మార్కెట్లలో కొన్ని రోజులుగా ఇన్‌స్టంట్ ఫుడ్ సెక్షన్లలో స్టాక్ వేగంగా ఖాళీ అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
News March 18, 2026
గ్రాము బంగారం ₹లక్ష.. రాబర్ట్ కియోసాకి అంచనా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలో భారీ కుదుపు తప్పదని ‘రిచ్ డాడ్.. పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. అది జరిగిన ఏడాది వ్యవధిలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయన్నారు. గ్రాము గోల్డ్ ధర దాదాపు ₹లక్ష, గ్రాము వెండి ధర ₹540కి చేరే అవకాశం ఉందన్నారు. బిట్‌కాయిన్ $7,50,000, ఎథీరియం $95,000కు చేరతాయని తెలిపారు. తెలివైన ఇన్వెస్టర్లు దీన్నుంచి భారీగా సంపాదించుకుంటారని పేర్కొన్నారు.


