News November 11, 2025

అయ్యప్ప దీక్షా నియమాలు (2/2)

image

☞ గురు/కన్న/అర్చక స్వామి చేతుల మీదుగా మాలధారణ చేయాలి. ☞ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీటి స్నానం చేయాలి. ☞ సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. ☞ తాంబూలం, ధూమపానం, మద్యపానం, జూదం వంటి దురలవాట్లను వీడాలి. ☞ మలమూత్ర విసర్జన తర్వాత కాళ్లు, చేతులతో పాటు కళ్లు, పెదవులు శుభ్రం చేసుకోవాలి. ☞ శవాన్ని చూడకూడదు. అపకర్మలలో పాల్గొనకూడదు. ఏమైనా అనుమానాలుంటే గురుస్వామిని సంప్రదించాలి. <<-se>>#AyyappaMala<<>>

Similar News

News November 11, 2025

నీకు మరింత శక్తి చేకూరాలి సంజూ: CSK

image

ఇవాళ సంజూ శాంసన్ పుట్టినరోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడికి స్పెషల్ విషెస్ తెలిపింది. ‘నీకు మరింత శక్తి చేకూరాలి సంజూ. విషింగ్ యూ సూపర్ బర్త్‌డే’ అంటూ అతడి ఫొటోను Xలో షేర్ చేసింది. IPLలో శాంసన్‌ను CSK తీసుకోనుందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దీంతో సంజూ చెన్నైకి రావడం కన్ఫర్మ్ అయిందంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News November 11, 2025

మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్టు హొమి వైర్‌వాలా

image

భారత్‌లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు హొమి వైర్‌వాలా. 1930ల్లో కెరీర్‌ ప్రారంభించిన హొమి తాను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్‌ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ ప్రకటించింది.

News November 11, 2025

ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు

image

DL: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఆత్మాహుతి దాడి అనేలా ఆధారాలు లభిస్తున్నాయి. i20 కారులో ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హరియాణా రిజిస్టర్డ్ కారును కశ్మీర్ వాసి తారిఖ్ కొన్నాక పలువురి నుంచి నిన్న డ్రైవ్ చేసిన Dr.ఉమర్‌కు చేరింది. JK పోలీసులు UP ఫరీదాబాద్‌లో నిన్న అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితులతో ఇతడికి కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం.