News November 11, 2025
కర్నూలు: నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లిన మధును అరెస్టు చేసినట్లు కర్నూల్ టౌన్-4 సీఐ విక్రమ్ సింహ తెలిపారు. వెల్దుర్తి(M) బుక్కాపురానికి చెందిన మధు(22) సోమవారం పాపతో హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. బాలిక తల్లి సునీత బిక్షాటన చేసుకుంటూ గుడి వద్ద నిద్రించేది. ఈ క్రమంలో మధు పాపను ఎత్తుకెళ్లి అమ్మేందుకు యత్నించాడని సీఐ తెలిపారు.
Similar News
News November 11, 2025
కుందేళ్ల పెంపకం.. మేలైన జాతులు ఏవి?

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.
News November 11, 2025
ఇరిగేషన్ శాఖకు రూ.52.5 కోట్ల నష్టం

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికంగా పడింది. ప్రధానంగా మున్నేరు ఉదృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో కాలువలు కోతకు గురయ్యాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. మైనర్ ఇరిగేషన్ డామేజ్ 91 ప్రాంతాల్లో జరగగా రూ.32.5cr నష్టం వాటిల్లింది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.12.5cr, మేజర్ ఇరిగేషన్ రూ.7.5cr, కల్వర్టులకు రూ. 3.64cr వరకు ఖర్చవుతాయని అధికారులు తేల్చారు.
News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్‌లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.


