News November 11, 2025

పెరగనున్న చలి.. ఇవాళ్టి నుంచి జాగ్రత్త!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నిన్న TGలోని ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ్టి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో కనిష్ఠంగా 9-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. అటు APలోని విశాఖ, మన్యం జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 11, 2025

సింగిల్స్ డే!

image

చాలా మంది సింగిల్‌గా ఉండటాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. తాము ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తమ లైఫ్‌కు తామే కింగ్స్ అంటూ గర్వంగా చెబుతుంటారు. అలాంటి వారి కోసం పుట్టిందే ‘సింగిల్స్ డే’(నవంబర్ 11న). మనకూ ఓ రోజు ఉంది మావా అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ‘సింగిల్స్ డే’ చైనాలో మొదలైంది. కాగా సింగిల్‌గా ఉంటే.. ఫిజికల్​గా, మెంటల్​గా స్ట్రాంగ్‌గా ఉంటారని పలువురు చెబుతున్నారు.

News November 11, 2025

క్లౌడ్ స్కిన్ మేకప్ గురించి తెలుసా?

image

మేకప్‌ ఇప్పుడు ప్రతి అమ్మాయి రొటీన్‌లో భాగమైపోయింది. వాటిల్లో కొత్తగా వచ్చిందే ఈ క్లౌడ్ స్కిన్ మేకప్. అన్నిరకాల చర్మతత్వాలకు సరిపడే ఈ మేకప్‌లో ముందుగా సీరమ్, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పోర్‌ బ్లరింగ్‌ ప్రైమర్‌, ఫౌండేషన్‌ అద్దుకోవాలి. తర్వాత బ్లష్‌, మ్యాట్‌ ఫినిష్‌ బ్రాంజర్‌ రాసుకోవాలి. అంతే మ్యాట్ ఫినిష్‌‌తో వచ్చే మేకప్ పూర్తయినట్లే. మ్యాట్ ఫినిష్ లిప్‌స్టిక్ వేసుకుంటే ఇంకా బావుంటుంది.

News November 11, 2025

జూబ్లీ బైపోల్.. 20.76శాతం పోలింగ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76శాతం ఓటింగ్ నమోదైంది. మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రీప్లేస్ చేసినట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అటు నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో తిరుగుతున్న ముగ్గురు నాన్‌లోకల్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు బిహార్‌లో ఉ.11 గంటల వరకు 31.38శాతం పోలింగ్ నమోదైంది.