News November 11, 2025
కాకినాడ కలెక్టర్ తీరుపై విమర్శలు!

కలెక్టర్ షాణ్మోహన్ వివాదాలలో ఇరుక్కుంటున్నారు. కాకినాడ నగరంలో ఆస్తి పన్నులు పెంచుతామని, పార్కులు ప్రైవేటీకరణ చేస్తామని ఆయన ప్రకటించడం, నగరంలో ఖాళీ స్థలాలు ఉండి వాటిని పరిశుభ్రం చేసుకోకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామనడం విమర్శలకు తావిచ్చాయి. మరోవైపు కలెక్టర్‌గా 7 నియోజకవర్గాలను సమ దృష్టితో చూడడం లేదని, పిఠాపురానికి పెద్దపీఠ వేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఒకింత ఆగ్రహంగా ఉన్నారట.
Similar News
News November 11, 2025
HYD: మొయినుద్దీన్ కదలికలపై ATS ఆరా

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. వీరిలో ఎందరు ఇతడి ద్వారా ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు తదితరాలను ఆరా తీస్తోంది.
News November 11, 2025
తాండూర్ కంది సాగు రికార్డు

వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది కంది సాగు గత ఏడాది కంటే వేల ఎకరాలు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. గత ఏడాది 1.04L ఎకరాల్లో కంది పంట వేయగా, ఈ ఏడాది 1.05L ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు. తాండూర్ కందిపప్పుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించి జీఐ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ కంది పప్పు పోషకాలతో పాటు రుచికరంగా ఉండటం విశేషం.
News November 11, 2025
ఆజాద్ స్ఫూర్తితో ముందుకు సాగాలి: కలెక్టర్

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆజాద్ జయంతి, మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.


