News April 11, 2024

అవనిగడ్డ ఎవరి అడ్డా!

image

AP: కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన అవనిగడ్డ ఆరు మండలాలతో అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. 1962లో ఈ సెగ్మెంట్ ఏర్పడగా.. కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ ఒకసారి నెగ్గాయి. పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేస్తోంది. టీడీపీ నుంచి పార్టీలో చేరిన సీనియర్ లీడర్ మండలి బుద్ధ ప్రసాద్‌ను జనసేన పోటీ చేయిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు మరోసారి బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 27, 2026

లగ్జరీ ఫ్లాట్ కొన్న గిల్.. బిల్డర్ హీరోయిన్ భర్తే!

image

దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహూలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.20.7 కోట్లు పెట్టి ఓ అపార్ట్‌మెంట్ 12వ ఫ్లోర్‌లో 3,369 చ.అ. ఫ్లాట్ కొన్నారు. స్టాంప్ డ్యూటీకే 1.24Cr చెల్లించారు. ఇక ఈ అపార్ట్‌మెంట్‌ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి రకుల్‌ప్రీత్ భర్త జాకీ భగ్నానీ, ఆయన పేరెంట్స్ నిర్మిస్తుండటం గమనార్హం. దీని నిర్మాణం 2029లో పూర్తి కానుంది.

News March 27, 2026

పెంటగాన్‌లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఏం జరగబోతోంది?

image

US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల <<18781285>>పిజ్జా ఆర్డర్లు<<>> పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. తాజాగా పాపా జాన్స్ ఆర్డర్లు 296%, డొమినోస్ 208%, పిజాటో ఆర్డర్లు 200% పెరిగాయి. పశ్చిమాసియాకు US మరిన్ని బలగాలను పంపనుందనే వార్తల నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ‘కొన్ని గంటల్లో కీలక ప్రకటన’ అంటూ వైట్‌హౌస్ చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలేం జరగబోతోంది?

News March 27, 2026

‘థాంక్యూ ఇండియా’ అని మిస్సైల్‌పై రాసి..

image

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు మిస్సైళ్లతోనే ఇరాన్ సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తమకు సంఘీభావం తెలిపిన దేశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు చెబుతోంది. ‘థాంక్యూ జర్మన్ పీపుల్. థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ అంటూ క్షిపణులపై సందేశాలు రాసి మరీ ప్రయోగిస్తోంది. స్పెయిన్, పాక్‌కూ ఇలానే థాంక్స్ చెప్పినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాల్లోని US బేస్‌లపై ఈ దాడులు చేసినట్లు IRGC తెలిపింది.