News November 11, 2025

HYD: “ఏ బాబు లెవ్”.. ఓటెయ్!

image

జూబ్లీహిల్స్‌లో పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.02 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఓటర్లు ఇకనైనా మేల్కొనాలని SMలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ఏ బాబు లెవ్.. ఓటెయ్’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సెలవు ఉంటే నగరవాసులు కాస్త ఆలస్యంగానే లేస్తారని ఓ అధికారి సైతం గుర్తుచేశారు. కానీ, మరీ ఆలస్యం అయ్యింది. ఇకనైనా మేల్కొండి. ఓటింగ్‌ పర్సంటేజ్‌ను పెంచండి.
SHARE IT

Similar News

News November 11, 2025

పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు

image

వంగర మండలంలోని అరసాడలో రూ.102 కోట్లతో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెట్టుబడులకు ఆకర్షితులు కాకుండా పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు మట్టిలో మాణిక్యాలు అని, ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.

News November 11, 2025

విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

image

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

News November 11, 2025

వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

image

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.