News November 11, 2025
భద్రాద్రి పాలకమండలి ఏర్పాటుపై పడని ముందడుగు

భద్రాద్రి రామాలయానికి ఉమ్మడి ఏపీలో 2012 NOV 25 వరకు ట్రస్ట్ బోర్డు పనిచేసింది. అనంతరం పాలకమండలి ఏర్పాటుపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో పాలకమండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 50మందికి పైగా దరఖాస్తు సమర్పించారు. అయినా నేటికి పాలకమండలి ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు. 3రోజుల క్రితం సర్కారు సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల కానుంది.
Similar News
News November 11, 2025
రక్షణ చట్టం వచ్చేవరకు మా అడుగులు ఆగవు- న్యాయవాదుల

న్యాయవాదుల భద్రత దేశ న్యాయవ్యవస్థ గౌరవానికి మూలం. రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా అడుగులు ఆగవు అని న్యాయవాద సంఘ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్’ పాదయాత్ర మూడో రోజు బీచుపల్లి శ్రీరామాలయం ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమైంది. ‘న్యాయవాది రక్షణ చట్టం – ఇప్పుడే అమలు చేయాలి’ అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
News November 11, 2025
విజయవాడ: 11 గంటలైనా ఈ ప్రభుత్వ ఆఫీసుకి ఉద్యోగులు రారు!

విజయవాడ బందర్ రోడ్‌లోని పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం జిల్లా కార్యాలయంలో 18 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదయం 11 గంటలు అయినప్పటికీ కేవలం ఆరుగురు మాత్రమే ఆఫీసుకు వచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన సమయం 10గంటలు కాగా.. వారంలో సగం రోజులకు పైగా 11 గంటల వరకు ఉద్యోగులు రావడం లేదని ఆరోపణలున్నాయి. ప్రభుత్వ కార్యాలయం కదా ఎప్పుడొచ్చినా అడిగే వారు ఎవరులే అన్నట్లు అధికారులు తీరు కనిపిస్తోంది.


