News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్‌లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
Similar News
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
News November 11, 2025
కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.
News November 11, 2025
మరో భారీ ఎన్‌కౌంటర్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్‌లో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కీలక మావోయిస్టును బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.


