News April 11, 2024
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీవో ఇచ్చింది. ఈ GO ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేయగా.. ఈ నెల 15న న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
అమెరికాకు షాక్.. కుప్పకూలిన 16 యుద్ధ విమానాలు

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు 16 యుద్ధ విమానాలను కోల్పోయినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వీటిలో పది MQ-9 రీపర్ డ్రోన్లు, మూడు F-15లు, రీఫ్యూయలింగ్ విమానం KC-135 ఉన్నాయని తెలిపింది. అలాగే సౌదీలోని ఓ అమెరికన్ వైమానిక స్థావరంలోని ఐదు KC-135లు డ్యామేజ్ అయ్యాయంది. వీటిలో కొన్ని ఇరాన్ కూల్చగా, మరికొన్ని ఫ్రెండ్లీ ఫైర్‌లో దాడికి గురయ్యాయని పేర్కొంది.
News March 20, 2026
‘కబంధ హస్తాలు’ అంటే ఏమిటి?

దయలేని బలవంతుడైన వ్యక్తి అధీనంలో ఎవరైనా చిక్కుకుపోయినప్పుడు ‘కబంధ హస్తాలు’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి వచ్చింది. ఇంద్రుడి శాపంతో కబంధుడు అనే రాక్షసుడికి మొండెం, చేతులు మాత్రమే ఉంటాయి. అతడు ఎక్కడికీ వెళ్లలేకపోయినా చేతులు ఎంత దూరమైనా వెళ్తాయి. అందులో చిక్కితే మరణమే. వనవాసంలో రామలక్ష్మణులను ఇలాగే బంధించగా వారు అతని చేతులను నరికేసి శాప విమోచనం కలిగిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 20, 2026
133 ఏళ్ల రైల్వే బ్రిడ్జికి గుడ్‌బై

AP: విజయవాడలోని కృష్ణా నదిపై 1893 మార్చి 17న ప్రారంభించిన తొలి మీటర్ గేజ్ రైల్వే బ్రిడ్జికి 133 ఏళ్లు నిండాయి. ఇది 1989 వరకు సేవలందించింది. దీని స్థానంలో డబుల్ లైన్ బ్రిడ్జిని నిర్మించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. విజయవాడ-గూడూరు మార్గంలోని పిల్లర్లను హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావట్లేదు. దీంతో వాటిని లిమిటెడ్ బ్లాస్టింగ్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.


