News November 11, 2025
జడేజాను వదులుకోవద్దు: సురేశ్ రైనా

జడేజాను CSK వదులుకోనుందనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించారు. జడేజాను కచ్చితంగా రిటైన్ చేసుకోవాలన్నారు. CSKకు అతను గన్ ప్లేయర్ అని, టీమ్ కోసం కొన్నేళ్లుగా ఎంతో చేస్తున్నారని గుర్తు చేశారు. ‘సర్ జడేజా’ జట్టులో ఉండాల్సిందే అని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. RRతో ట్రేడ్‌లో జడేజా స్థానంలో CSK సంజూను తీసుకోవడం ఖరారైనట్లు క్రీడావర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2026
అరసవల్లి ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రం ఇదే

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రాన్ని శనివారం అధికారులు విడుదల చేశారు. ఇంద్రపుష్కరిణి అభివృద్ధికి రూ.4కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించిన విషయం విదితమే. ఈ మేరకు పుష్కరిణి నమూనా చిత్రాన్ని విడుదల చేశారు. కాగా భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆలయంలో పలు మార్పులకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
News March 21, 2026
‘ధురంధర్’.. హీరో రెమ్యునరేషన్ ఎంతంటే?

ధురంధర్ సినిమా రెండు పార్టులకు కలిపి దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హీరో రణ్‌వీర్ సింగ్ రూ.50 కోట్లు, సంజయ్ దత్ రూ.10 కోట్లు, మాధవన్ రూ.9 కోట్లు, అక్షయ్ ఖన్నా రూ.2.5 కోట్లు, అర్జున్ రాంపాల్ రూ.కోటి, సారా అర్జున్ రూ.కోటి తీసుకున్నట్లు సమాచారం. కాగా పార్ట్-1 రూ.1,300 కోట్ల కలెక్షన్లు సాధించింది. పార్ట్-2 అంతకంటే ఎక్కువే రాబట్టడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.
News March 21, 2026
కుప్పకూలిన ధరలు.. టమాటా రైతుల కన్నీళ్లు

AP: గిట్టుబాటు ధర లభించక టమాటా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న KG ధర గరిష్ఠంగా ₹7, కనిష్ఠంగా ₹3, సగటున ₹5 మాత్రమే పలికింది. అన్నమయ్య జిల్లాలో కోత ఖర్చులూ రాకపోవడంతో అన్నదాతలు పంటను పశువులకు వదిలేశారు. శ్రీకాకుళం(D)లోని పలు గ్రామాల్లో 27 KGల ట్రే ధర ₹70-90కి పడిపోయింది. వ్యాపారులు మాత్రం KG ₹20-30కి విక్రయిస్తుండటం గమనార్హం. మీ ఏరియాలో టమాటా రేటు ఎలా ఉంది?


