News November 11, 2025

చలికి వణుకుతున్న జగిత్యాల జిల్లా

image

జగిత్యాల జిల్లా చలికి వణుకుతోంది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన్నెగూడెంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.5℃గా నమోదైంది. అటు గోవిందారం 12.7, మల్లాపూర్, రాఘవపేట, గొల్లపల్లె, తిరమలాపూర్ 12.9, కాత్లాపూర్, నేరెల్ల 13, పూడూర్ 13.3, రాయికల్ 13.4, కోల్వాయి, సరంగాపూర్, మెడిపల్లి 13.7, కోరుట్ల 13.8, పెగడపల్లె 13.2, మల్యాల 13.9, జగిత్యాలలో 14.1℃ గా నమోదయ్యాయి. మిగతా ప్రాంతంల్లోనూ చలి తీవ్రత ఉంది.

Similar News

News November 11, 2025

అచ్యుతాపురం: ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

image

సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో అచ్యుతాపురంలో పలు కంపెనీల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఏ.ఆర్.టీ.టైర్ కంపెనీ 3వ యూనిట్, లారస్ కంపెనీ 8వ యూనిట్‌ను ప్రారంభించారు.అలాగే లారెన్స్ ల్యాబ్, లారస్ సింథటిక్ యూనిట్‌కి శంకుస్థాపన చేశారు.

News November 11, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. సచివాలయ ఉద్యోగి మృతి

image

నెల్లూరు NTR నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి ముజాహిద్దీన్ అలీ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈయన ద్వారకా నగర్-2 వార్డు సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. బైక్‌పై వస్తుండగా లారీ ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు.

News November 11, 2025

HYD: రూ. 2 కోట్లు విలువైన స్మార్ట్‌ఫోన్ల స్వాధీనం

image

HYD పోలీసులు వివిధ నగరాల్లో ఫోన్‌ చోరీల ముఠాను చేధించారు. మొత్తం 31 మంది నిందితులను అరెస్ట్‌ చేసి, రూ.2 కోట్లు విలువైన స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌ దొంగిలించిన మొబైల్‌ ఫోన్ల IMEI నంబర్లను మార్చి ఆఫ్రికా దేశాలకు, ముఖ్యంగా సౌత్‌ సూడాన్‌కు రవాణా చేస్తూ విస్తృతంగా అక్రమ రవాణా జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ సైబరాబాద్‌, హైదరాబాద్‌ మధ్య జరిగింది.