News April 11, 2024

ఆర్సీబీపై బుమ్రా అరుదైన రికార్డు

image

వాంఖడేలో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగారు. ఈక్రమంలో 2సార్లు హ్యాట్రిక్ మిస్ కావడం గమనార్హం. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌లో ఆర్సీబీపై 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా అవతరించారు. చివరిగా ఆశిష్ నెహ్రా CSK తరఫున 4 వికెట్లు తీశారు. ఇప్పటి వరకు బెంగళూరుపై అదే అత్యుత్తమం. ఇక ఐపీఎల్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీసిన ఫాల్క్‌నర్, ఉనాద్కత్, భువనేశ్వర్ సరసన బుమ్రా చేరారు.

Similar News

News March 3, 2026

భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

image

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.

News March 3, 2026

ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

image

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.

News March 3, 2026

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇంజినీర్స్ <<>>ఇండియా లిమిటెడ్ 6 జూనియర్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్), డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.29,000-రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.engineersindia.com/