News November 11, 2025
HYD: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు

HYD ఫిలింనగర్ PSలో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రోడ్ నంబర్ 7లో ఉంటున్న శివప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఇటీవల బంధువుల వద్దకి వెళ్లాడు. ఈ క్రమంలో బెల్లంకొండ సురేశ్ తన ఇంటి తాళం పగులగొట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, ఆక్రమించేందుకు యత్నించాడని శివప్రసాద్ PSలో ఫిర్యాదు చేశాడు. సిబ్బందిని కూడా దూషిస్తూ దాడికి యత్నించాడన్నారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
BREAKING: HYD: మాగంటి సునీతపై కాంగ్రెస్ ఫిర్యాదు

BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఎలక్షన్ కమిషన్‌కి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రెస్‌మీట్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి సునీత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసింది. ఎన్నిక జరుగుతుండగానే ప్రెస్‌మీట్ పెట్టారని పేర్కొంది. ప్రెస్‌మీట్ నిర్వహించొద్దని,ఒకవేళ నిర్వహిస్తే ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఇప్పటికే ECI స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపింది.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: 3PM UPDATE.. 40.20% ఓటింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ప్రతి 2 గంటలకు సగటున 10 శాతం ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ ఉండగా.. లంచ్ టైమ్ తర్వాత కూడా అదే విధంగా సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంతమేర పోలింగ్ పెరుగుతుందో వేచి చూడాలి.


