News April 11, 2024
నాగర్‌కర్నూలు లోక్‌సభ: BRS సమన్వయకర్తలు వీళ్లే..
నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తలు.. నాగర్‌కర్నూలు–వాల్యానాయక్, గద్వాల–ఇంతియాజ్ అహ్మద్, అలంపూర్–దేవరమల్లప్ప, కల్వకుర్తి–చాడా కిషన్‌రెడ్డి, వనపర్తి–బైకాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట – నవీన్‌కుమార్‌రెడ్డి, కొల్లాపూర్ – డాక్టర్ ఆంజనేయులు గౌడ్ నియమించారు.
Similar News
News January 4, 2025
ఎర్రవల్లి: ప్రజలకు ఉత్తమ సేవలదించాలి: ఐజీ
కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలందించి డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్‌గా ఎంపికైన వారు ఎర్రవల్లి పదో బెటాలియన్‌లో 9 నెలలు శిక్షణ పూర్తి చేశారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 4, 2025
అచ్చంపేట: ఉమామహేశ్వర స్వామి ఆలయం చరిత్ర ఇదే !
శివుడు, పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఉమామహేశ్వరం ఆలయం ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన చెట్లతో కూడిన కొండపై.. ఉత్తర ద్వారం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం కలిగి ఉంది. రెండో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని మౌర్య చంద్రగుప్త పాలనలో ఉంది. దీన్నే పూర్ మ్యాన్స్ ఊటీ అని పిలుస్తారు. క్రీ.శ.14వ శతాబ్దిలో మాధవనాయుడు కొండపైకి వెళ్ళేందుకు మెట్లను నిర్మించినట్లు ప్రచారం.
News January 4, 2025
దేవరకద్ర: సాగుచేసిన రైతులకు రైతుభరోసా: జూపల్లి
పంటలు సాగు చేసిన రైతులకు రైతుభరోసా అందిస్తామని, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దేవరకద్రలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత BRS ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు.