News November 11, 2025
రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్‌లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి
Similar News
News November 11, 2025
థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు. ✍️ మరింత ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 11, 2025
ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.
News November 11, 2025
గట్లు చెక్కే యంత్రంతో కలిగే లాభాలు

సాధారణంగా ఇద్దరు మనుషులు రోజంతా కష్టపడితే ఎకరం పొలంలో గట్టు చెక్కగలరు. ఈ యంత్రం సహాయంతో ఒక రోజులో 15 నుంచి 25 ఎకరాల వరకు గట్లు చెక్కవచ్చు. ఈ యంత్రం సాయంతో గంటకు 3-4 ఎకరాల్లో.. దాదాపు 18 ఇంచుల వరకూ గట్లు చెక్కవచ్చంటున్నారు నిపుణులు. ఈ మెషిన్ భాగాలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం వల్ల బురదలో నడిచినా తుప్పు పట్టవు. అతి ముఖ్యంగా కూలీల కొరత సమస్యకు ఈ యంత్రం చెక్ పెడుతుంది.


