News November 11, 2025
WGL: పాలకవర్గాలు లేక నిధుల నిలిపివేత..!

గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేమని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులపై ఆశలు వమ్మయ్యాయి. కేంద్ర నిధులు 2024 ఆగస్టు నుంచి రాష్ట్ర ఎస్ఎఫ్‌సీ నిధులు 2023 ఆగస్టు నుంచి నిలిచిపోయాయి. ఉమ్మడి WGL జిల్లాలోని 1708 జీపీల్లో సుమారు రూ.70 కోట్లు ట్రెజరీల్లో నిలిచి, గ్రామాల్లో అభివృద్ధి పనులు స్తబ్ధుగా మారాయి.
Similar News
News November 11, 2025
థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు. ✍️ మరింత ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 11, 2025
ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.
News November 11, 2025
పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. రైతులు తేమశాతం 12 లోపు ఉంచి పత్తి విక్రయించాలన్నారు. పత్తి కొనుగోలు సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా సమీప జిన్నింగ్ మిల్లుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. కౌలు రైతులు కూడా యాప్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.


