News November 11, 2025

కోస్గి: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

image

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశా త్తు ఓ దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI బాలరాజ్ కథనం.. సోమవారం సాయంత్రం ఈర్లపల్లి చెరువుకు చేపల కోసం వెళ్లి ఆంజనేయులు(30) వెళ్లి మరణించాడు. బతుకుదెరువు కోసం కల్వకుర్తి నుంచి గుండుమాల్ దగ్గరలోని అప్పయ్య పల్లికి వచ్చాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు.

Similar News

News November 11, 2025

థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

image

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్​లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్​లో చేర్చుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు. ✍️ మరింత ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 11, 2025

ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.

News November 11, 2025

పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. రైతులు తేమశాతం 12 లోపు ఉంచి పత్తి విక్రయించాలన్నారు. పత్తి కొనుగోలు సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా సమీప జిన్నింగ్ మిల్లుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. కౌలు రైతులు కూడా యాప్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.