News November 11, 2025
మెదక్: సమస్యల సత్వర పరిష్కారానికి… లోక్ అదాలత్: ఎస్పీ

ఈ నెల 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు కోరారు. త్వరగా, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్‌లో లభిస్తుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన వంటి రాజీపడే అవకాశమున్న కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.
Similar News
News March 26, 2026
మెదక్: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మైనింగ్, ఇరిగేషన్, పంచాయతీ హౌసింగ్ అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరా మన ఇసుక వాహనం ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని తెలిపారు.
News March 26, 2026
మెదక్: ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లకుపైగా బకాయిలు: మంత్రి

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.600 కోట్లకు పైగా, ఈహెచ్‌ఎస్ కింద రూ.130 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ హవర్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఉచిత వైద్యం అందించామని చెప్పారు. నెలకు సగటున రూ.89 కోట్లు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2400 కోట్లకు పైగా విడుదల చేశామని తెలిపారు.
News March 26, 2026
MDK: డబ్బాలలో పెట్రోల్, డీజిల్ నిల్వ నిషేధం: ఎస్పీ

డబ్బాలు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయవద్దని సూచించారు. పెట్రోల్ బంక్ డీలర్లు నిషేధ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


