News November 11, 2025

ఆజాద్ స్ఫూర్తితో ముందుకు సాగాలి: కలెక్టర్

image

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ సేవలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆజాద్ జయంతి, మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

దేవుడి గురించి అడిగిన ధర్మరాజు

image

యుధిష్టిర ఉవాచ :
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం|
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
భావం: లోకంలో దైవమనగా నేమి? ప్రధానమైన ఉత్తమ గమ్యస్థానం ఏది? ఏ దేవుని స్తుతించుట వల్ల, పూజించుట వల్ల మానవులు శుభాలను పొందుతారు.
ఈ శ్లోకం భగవంతుని ఏకత్వాన్ని, మానవ జీవితానికి లక్ష్యాన్ని సాధించే మార్గాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసను తెలుపుతుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 11, 2025

నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. వయస్సు18 నుంచి 30 లోపు వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని తెలిపారు.

News November 11, 2025

HYD: గృహ ప్రవేశం.. ఓనర్‌ను ఘోరంగా కొట్టిన హిజ్రాలు

image

గృహ ప్రవేశం రోజు యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చీర్యాలలోని బాలాజీఎన్‌క్లేవ్‌లో జరిగింది. సదానందం నూతన ఇంటికి వచ్చిన హిజ్రాలు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యజమాని నిరాకరించగా మరో 15 మందిని వెంట పెట్టుకొచ్చి కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో సదానందం తలకు గాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.