News November 11, 2025
ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

విజయవాడ RTC జోనల్‌లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చి పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 11, 2025
సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://surveyofindia.gov.in
News November 11, 2025
యంగ్‌గా ఉండాలా.. ఎక్కువ భాషలు నేర్చుకో

వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఒకే భాషలో మాట్లాడేవారితో పోలిస్తే 2 అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారి మెదడు యవ్వనంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 27 యూరోపియన్ దేశాలలో 51-90 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 80వేల మందిపై జరిపిన స్టడీలో ఇది వెల్లడైంది. ఒకే భాషలో మాట్లాడేవారి మెదడు 2 రెట్లు త్వరగా వృద్ధాప్య దశకు చేరుకుంటున్నట్టు స్పష్టమైంది. లేటెందుకు ఈరోజు నుంచే కొత్త భాష నేర్చుకోండి.
News November 11, 2025
HYD: డ్యూయల్ డిగ్రీ BSC కోర్సుకు కౌన్సెలింగ్

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ BSC (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు PJTAU రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో గురువారం కౌన్సెలింగ్‌కి హాజరు కావాలన్నారు.


