News November 11, 2025
రాష్ట్రంలో 175 పారిశ్రామిక పార్కులు: CBN

AP: రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు నెలకొల్పుతామని CM CBN ప్రకటించారు. ‘ఇపుడు15 MSMEలు ప్రారంభించాం. మరో 35కి శంకుస్థాపన చేశాం. కొత్తగా మరో 70 ఏర్పాటుచేస్తాం’ అని చెప్పారు. వీటిలో 99 పరిశ్రమలు రానున్నాయన్నారు. ప్రధాని మోదీ దేన్ని ప్రవేశపెట్టినా APకి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో PPAల రద్దుతో ₹9వేల CR వృధా చేశారన్నారు. పెట్టుబడిదారులు తిరిగి వస్తున్నారన్నారు.
Similar News
News November 11, 2025
ఉగ్రవాదంపై పోరాటానికి ఇండియాకు మా మద్దతు: ఇజ్రాయెల్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ విచారం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. ఈ ఘటనపై NIA దర్యాప్తు చేయనుంది.
News November 11, 2025
పలు రైళ్లు రద్దు.. ఆ స్టేషన్ల మధ్య 2 స్పెషల్ రైళ్లు

ట్రాక్ మరమ్మతుల కారణంగా విజయవాడ డివిజన్‌లో నాలుగు రైళ్లను ఈ నెల 20న రద్దు చేసినట్లు SCR వెల్లడించింది. ఈ జాబితాలో కాకినాడ పోర్ట్-విశాఖ(17267), విశాఖ-కాకినాడ పోర్ట్(17268), రాజమండ్రి-విశాఖ(67285), విశాఖ-రాజమండ్రి(67286) రైళ్లు ఉన్నాయి. అలాగే ప్రయాణికుల రద్దీ కారణంగా రేపు నర్సాపూర్-సికింద్రాబాద్(07455), ఈ నెల 15న అనకాపల్లి-సికింద్రాబాద్(07179) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
News November 11, 2025
ICAR-IARIలో ఉద్యోగాలు

ఢిల్లీలోని<


