News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్‌కు తీసుకెళ్లండి.

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: 3PM UPDATE.. 40.20% ఓటింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ప్రతి 2 గంటలకు సగటున 10 శాతం ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ ఉండగా.. లంచ్‌ టైమ్‌ తర్వాత కూడా అదే విధంగా సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంతమేర పోలింగ్ పెరుగుతుందో వేచి చూడాలి.

News November 11, 2025

HYD: రూ. 2 కోట్లు విలువైన స్మార్ట్‌ఫోన్ల స్వాధీనం

image

HYD పోలీసులు వివిధ నగరాల్లో ఫోన్‌ చోరీల ముఠాను చేధించారు. మొత్తం 31 మంది నిందితులను అరెస్ట్‌ చేసి, రూ.2 కోట్లు విలువైన స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌ దొంగిలించిన మొబైల్‌ ఫోన్ల IMEI నంబర్లను మార్చి ఆఫ్రికా దేశాలకు, ముఖ్యంగా సౌత్‌ సూడాన్‌కు రవాణా చేస్తూ విస్తృతంగా అక్రమ రవాణా జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ సైబరాబాద్‌, హైదరాబాద్‌ మధ్య జరిగింది.

News November 11, 2025

HYD: మరో 10 రాష్ట్రాలకు విస్తరించనున్న సింగరేణి

image

సింగరేణి కంపెనీ 10 రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించి, సింగరేణి గ్రీన్ ఎనర్జీ, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ ద్వారా 5,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థగా మారనుందని HYDలో ఎండీ బలరాం వెల్లడించారు. 40,000 మంది ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆధారపడి ఉన్న సింగరేణి భవిష్యత్తు శతాబ్దం పాటు సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు.