News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటు వేసేందుకు యువతులు సైతం ఆసక్తి చూపించారు. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ ఓటర్లకు ఓటింగ్ ఛాలెంజ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యతను గుర్తు చేశారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని కొన్ని బూత్‌లలో రద్దీ లేదని టాక్.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: 3PM UPDATE.. 40.20% ఓటింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ప్రతి 2 గంటలకు సగటున 10 శాతం ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ ఉండగా.. లంచ్ టైమ్ తర్వాత కూడా అదే విధంగా సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంతమేర పోలింగ్ పెరుగుతుందో వేచి చూడాలి.
News November 11, 2025
పాలమూరు: ఈనెల 15న ‘బ్యాడ్మింటన్’ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగంలో బాల, బాలికలకు బ్యాడ్మింటన్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. MBNRలోని DSA స్టేడియంలో ఈ నెల 15న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్‌లతో ఉ. 9:00 గంటలలోపు పీడీ సాధాత్ ఖాన్‌కు ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు(సింగిల్స్ & డబుల్స్) చొప్పున రిపోర్ట్ చేయాలన్నారు.
News November 11, 2025
NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం UG I,III,V సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు నవంబర్ 13 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు. I సెమిస్టర్ 5400, III సెమిస్టర్ 5830, V సెమిస్టర్ 5597 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నల్గొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 09, యాదాద్రి భువనగిరి జిల్లాలో 09 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కంట్రోలర్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు.


