News April 12, 2024

TODAY HEADLINES

image

➥CM జగన్‌ను జైలుకు పంపుతాం: పవన్ కళ్యాణ్
➥ముగ్గురం మళ్లీ జతకట్టాం.. జగన్ నిలబడగలడా?: CBN
➥ఏపీలో రూ.100కోట్ల విలువైన సొత్తు జప్తు: EC
➥జగన్ సంస్కరణలతో పేదరికం తగ్గింది: బొత్స
➥లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన CBI
➥BRS ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదు: కోమటిరెడ్డి
➥కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైంది: హరీశ్
➥కడియం కావ్య కాదు.. మహమ్మద్ కావ్య నజరుద్దీన్: ఆరూరి
➥IPL: ఆర్సీబీపై ముంబై విజయం

Similar News

News March 21, 2026

ధురంధర్-2పై టాలీవుడ్ స్టార్ల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్ వైరల్

image

ధురంధర్-2 సినిమాపై అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్లు ఎవరూ స్పందించలేదు. ఇదే విషయంపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఇచ్చిన సమాధానం వైరలవుతోంది. ఎవరో కోరడం వల్లే వీరు స్పందిస్తున్నారనే అర్థం వచ్చేలా ‘దక్షిణాదికి సైతం ఆబ్లిగేషన్స్ విస్తరిస్తున్నాయనడానికి ఇవి సూచనలు’ అని పేర్కొన్నారు.

News March 21, 2026

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతుండగా మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

image

సౌదీలో జరిగిన మిస్సైల్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. యూపీకి చెందిన రవి గోపాల్ (26) రియాద్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 18న భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా ఫ్యాక్టరీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మిస్సైల్ శకలాలు మీద పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని బంధువులు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపేందుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ప్రయత్నిస్తోంది.

News March 21, 2026

తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: సీఎం

image

AP: తిరుమలలో భక్తులకు అందే సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని CM CBN అధికారులను ఆదేశించారు. TTD పరిధిలోని ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ ‘తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలి. అత్యాధునిక CCTVలు, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.