News November 11, 2025

అన్ని దేశాల టెకీలకు స్వర్గధామం మన HYD

image

చైనా, జపాన్, రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ సహా అనేక దేశాల టెకీలకు అనువైన ప్రాంతాల జాబితాలో HYD నిలిచింది. ఇతర దేశాల టెక్నికల్ ఇంజినీర్లు సైతం HYDకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని, అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా UK టీకి అశ్విన్‌రాజ పవన్ తెలిపారు. ఇతర దేశాలతో పోల్చితే HYDలో తక్కువ ఖర్చుతో, ఆనందంగా బతకడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చారు.

Similar News

News November 11, 2025

జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు!

image

జూబ్లీహిల్స్ ఎగ్జిట్‌ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

News November 11, 2025

FINAL UPDATE: జూబ్లీహిల్స్‌‌లో 48.43% పోలింగ్ నమోదు

image

నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారని మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి బాబు ఓటింగ్‌కు అంటే జూబ్లీహిల్స్‌లో ఆమడ దూరం పోయారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. వాలంటీర్లు సేవ చేశారు. మొబైల్ భద్రపరిచేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గంటసేపు ఓటింగ్ పెంచారు. అయినా సగానికి పైగా ఓటెయ్యలేదు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీలోనే ఓటింగ్ 48.43% నమోదు కావడం గమనార్హం.

News November 11, 2025

బేగంపేట్ సీఎం ప్రజావాణికి 132 దరఖాస్తులు

image

బేగంపేట్ ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి 132 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 41, రెవెన్యూశాఖ 29, హోంశాఖకు10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 31, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు రాగా.. ఇతర శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు. పలు దరఖాస్తులపై వెంటనే ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించామన్నారు.