News November 11, 2025

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో PO ఉద్యోగాలు

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. CMA/ICWA అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.southindianbank.bank.in

Similar News

News November 11, 2025

పాపం.. ప్రశాంత్ కిశోర్

image

దేశంలోని అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్‌ స్ట్రాటజీలు సొంత రాష్ట్రంలో తన పార్టీకి మాత్రం ఉపయోగపడలేదు. ‘జన్ సురాజ్’ ద్వారా బిహార్ గతిని మారుస్తానంటూ చేసిన ఆయన ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇవాళ వెలువడిన అనేక ఎగ్జిట్ పోల్స్‌.. PK పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని తేల్చాయి. అనేక పార్టీలకు అధికారం తెచ్చానన్న ఆయన మాత్రం గెలుపు దరిదాపుల్లోకీ రాలేకపోయారు.

News November 11, 2025

ONGC గ్యాస్‌ను రిలయన్స్ దొంగిలించిందా?

image

ముకేశ్ అంబానీపై కోర్టులో <<18259833>>పిటిషన్<<>> నేపథ్యంలో ONGC గ్యాస్‌ను RIL దొంగిలించిందా? అన్నది చర్చగా మారింది. APలోని KG బేసిన్లో 2004-14 మధ్య తన బావుల లోపల నుంచి RIL పక్కకు తవ్వి అదే బేసిన్లోని ONGC బావుల గ్యాస్‌($1.55B)ను తీసుకుందని అప్పట్లో అధికారులు కేంద్రానికి తెలిపారు. DM, AP షా కమిటీలూ దీన్ని నిర్ధారించాయి. ఆపై RIL తనకు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డు తెచ్చుకోగా ఢిల్లీ హైకోర్టు దాన్ని పక్కన పెట్టింది.

News November 11, 2025

కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

image

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.