News November 11, 2025
కర్నూలు జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన షెడ్యూల్..!

ఈ నెల 12న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
Similar News
News November 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రూ.202.93 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం 18,247 మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, మొత్తం రూ.2,900 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు.
News November 11, 2025
కేటిదొడ్డి: బావిలో అనుమానాస్పద మృతదేహం

కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ పరిధిలోని ఓ బావిలో మంగళవారం అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పైకి తీశారు. మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
బిహార్, జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు TGలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. బిహార్‌లో ఈనెల 6న 121 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరగగా 65.08% పోలింగ్ నమోదైంది. ఇవాళ 122 స్థానాలకు సా.5 గంటల వరకు 67.14% ఓటింగ్ రికార్డయింది. జూబ్లీహిల్స్‌లో సా.5 గంటల వరకు 47.16% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సమయం ముగిసినా సా.6లోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు.


