News April 12, 2024

శ్రీరామనవమికి గదులు ఆన్‌లైన్‌ బుకింగ్ : కలెక్టర్

image

భద్రాచలంలో ఈనెల 17, 18 తేదీలలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఒక ప్రకటన విడుదల చేశారు. https://book.bhadrachalamonline.com/book-hotel ఈ లింకు ద్వారా శ్రీరామ నవమి మహా పట్టాభిషేకానికి వచ్చే భక్తులు గదులు బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. 

Similar News

News March 11, 2026

ఖమ్మంలో రేపు జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం మార్చి 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని అర్క రెనాల్ట్ షోరూంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సేల్స్ టీం లీడర్స్, యూజ్డ్ కార్ ఎవల్యూటర్స్ పోస్టులకు మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, మెకానికల్ డిప్లొమా, బీటెక్ మెకానికల్ అర్హత కలిగిన 22-33 ఏళ్ల యువత సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.

News March 10, 2026

ఖమ్మం: ‘ప్రజాపాలన’ పనులపై సీఎస్‌ సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్‌ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.

News March 10, 2026

నక్షా లేని గ్రామాల్లో రీ-సర్వే.. సొంత భవనాల్లోకి కార్యాలయాలు

image

రాష్ట్రంలో భూ లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు అత్యాధునిక ‘రోవర్’ పరికరాలతో రీ-సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం HYDలో వారు మాట్లాడుతూ.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ కొత్త పోర్టల్ తీసుకువస్తామన్నారు. అలాగే సొంత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు.