News November 11, 2025

ICAR-IARIలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని<> ICAR<<>>-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, NET/ PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://new.iari.res.in

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్

image

ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి.
☞ చాణక్య స్ట్రాటజీస్: కాంగ్రెస్ 46%, BRS: 41%, BJP: 06%
☞ పబ్లిక్ పల్స్- కాంగ్రెస్: 48%, BRS: 41%, BJP: 06%
☞ స్మార్ట్ పోల్- కాంగ్రెస్: 48.2%, BRS: 42.1%
☞ నాగన్న సర్వే- కాంగ్రెస్: 47%, BRS: 41%, BJP: 08%
☞ జన్‌మైన్, HMR సర్వేలూ కాంగ్రెస్‌దే గెలుపు అంటున్నాయి.

News November 11, 2025

బిహార్‌లో NDA జయకేతనం: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

image

బిహార్‌లో BJP, JDU నేతృత్వంలోని NDA కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. 243 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, NDAకి 133-159, మహాఘట్ బంధన్‌కు 75-101, ఇతరులకు 2-8 స్థానాలు, జన్ సురాజ్ పార్టీకి 0-5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని వివరించింది. దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ కూటమిపై NDA పైచేయి సాధించనున్నట్లు తెలిపింది.

News November 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లాలో ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య <<18257519>>ఎదురు కాల్పులు<<>> జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురు మావోల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.