News November 11, 2025

BREAKING: HYD: మాగంటి సునీతపై కాంగ్రెస్ ఫిర్యాదు

image

BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఎలక్షన్ కమిషన్‌కి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రెస్‌మీట్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి సునీత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసింది. ఎన్నిక జరుగుతుండగానే ప్రెస్‌మీట్ పెట్టారని పేర్కొంది. ప్రెస్‌మీట్ నిర్వహించొద్దని,ఒకవేళ నిర్వహిస్తే ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఇప్పటికే ECI స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపింది.

Similar News

News November 11, 2025

ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

image

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్‌ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్‌లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్‌తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?

News November 11, 2025

జూబ్లీ పల్స్: ఎగ్జిట్ పోల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు!

image

జూబ్లీహిల్స్ ఎగ్జిట్‌ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు INC వైపు మొగ్గు చూపాయి. 2వ స్థానంలో BRS నిలుస్తుందని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసిన BJPకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. కీలకమైన సర్వేల్లోనూ కమలం కనీసం 10శాతం ఓటింగ్ రాబడుతుందని చెప్పలేకపోయాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌ను SMలో పెడుతూ BJP కీలక నేతల మీద ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

News November 11, 2025

FINAL UPDATE: జూబ్లీహిల్స్‌‌లో 48.43% పోలింగ్ నమోదు

image

నాయకులను ఎన్నుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారని మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి బాబు ఓటింగ్‌కు అంటే జూబ్లీహిల్స్‌లో ఆమడ దూరం పోయారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. వాలంటీర్లు సేవ చేశారు. మొబైల్ భద్రపరిచేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. గంటసేపు ఓటింగ్ పెంచారు. అయినా సగానికి పైగా ఓటెయ్యలేదు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీలోనే ఓటింగ్ 48.43% నమోదు కావడం గమనార్హం.