News November 11, 2025
యాపిల్ కొత్త ఫీచర్.. నెట్‌వర్క్ లేకున్నా మ్యాప్స్, మెసేజెస్!

మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకున్నా మ్యాప్స్, మెసేజ్‌లు పనిచేసే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందని బ్లూమ్‌బర్గ్ ఒక రిపోర్టులో తెలిపింది. యాపిల్‌కు చెందిన ఇంటర్నల్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ ఇప్పటికే గ్లోబల్‌స్టార్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ ద్వారా పనిచేసే ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ను 2022లో విడుదల చేసిన iPhone14లోనే అందుబాటులోకి తెచ్చింది.
Similar News
News November 11, 2025
పాపం.. ప్రశాంత్ కిశోర్

దేశంలోని అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలు సొంత రాష్ట్రంలో తన పార్టీకి మాత్రం ఉపయోగపడలేదు. ‘జన్ సురాజ్’ ద్వారా బిహార్ గతిని మారుస్తానంటూ చేసిన ఆయన ప్రచారాన్ని ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇవాళ వెలువడిన అనేక ఎగ్జిట్ పోల్స్.. PK పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమేనని తేల్చాయి. అనేక పార్టీలకు అధికారం తెచ్చానన్న ఆయన మాత్రం గెలుపు దరిదాపుల్లోకీ రాలేకపోయారు.
News November 11, 2025
ONGC గ్యాస్‌ను రిలయన్స్ దొంగిలించిందా?

ముకేశ్ అంబానీపై కోర్టులో <<18259833>>పిటిషన్<<>> నేపథ్యంలో ONGC గ్యాస్‌ను RIL దొంగిలించిందా? అన్నది చర్చగా మారింది. APలోని KG బేసిన్లో 2004-14 మధ్య తన బావుల లోపల నుంచి RIL పక్కకు తవ్వి అదే బేసిన్లోని ONGC బావుల గ్యాస్($1.55B)ను తీసుకుందని అప్పట్లో అధికారులు కేంద్రానికి తెలిపారు. DM, AP షా కమిటీలూ దీన్ని నిర్ధారించాయి. ఆపై RIL తనకు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డు తెచ్చుకోగా ఢిల్లీ హైకోర్టు దాన్ని పక్కన పెట్టింది.
News November 11, 2025
కూతురు తెచ్చిన అదృష్టం.. పావు కేజీ గోల్డ్ గెలిచాడు

బెంగళూరుకు చెందిన మంజునాథ్ హరోహళ్లికి దుబాయ్‌లో జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ లాటరీలో 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నారు. ఏడేళ్లుగా టికెట్ కొనుగోలు చేస్తున్న అతను ఈసారి తన కూతురి చేతుల మీదుగా టికెట్ తీసుకున్నారు. దీంతో అదృష్టం వరించింది. లాటరీ గెలవడాన్ని నమ్మలేకపోతున్నానని మంజునాథ్ చెప్పారు. తన కూతురి రూపంలో లక్ కలిసొచ్చిందని, ఆమె కోసం బహుమతి తీసుకుంటానని ఆయన తెలిపారు.


